పుట్టకోట గ్రామ అయ్యప్ప స్వాముల యిరుముడి కార్యక్రమ వేడుకలు

పుట్టకోట గ్రామ అయ్యప్ప స్వాముల యిరుముడి కార్యక్రమ వేడుకలు

ఖమ్మం: 15వ డివిజన్ పుట్టకోట గ్రామంలో శ్రీ ఆంజినేయ స్వామి వారి ఆలయం నందు అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం ఘనంగ జరిగింది. 70 మందికి పైగా ఉన్న పుట్టకోట పీఠంపై ఈరోజు ఇరుముడులు కాగా, డీజేలతో ఊరేగింపులో స్వాములతో పాటుగా ఆ గ్రామవాసులు అందరు పాల్గొని సందడి చేశారు. వారిని అంతా భక్తితో శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి సాగనంపారు.