బాలల భవిష్యత్తుకు కృషి చేయాలి: కలెక్టర్

బాలల భవిష్యత్తుకు కృషి చేయాలి: కలెక్టర్

NRPT: బాలల బంగారు భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, బాలల హక్కుల సంరక్షణలో భాగస్వాములవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా నారాయణపేటలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.