ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలి: పట్టాభిరామ్

ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలి: పట్టాభిరామ్

Vsp: తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆర్కే బీచ్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.