చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. వేసవిలో ఆసుపత్రికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేవిధంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ నరసింహ, ఏఎంసీ ఛైర్మన్ దోమ ఆనంద్ ఉన్నారు.