రైల్వే ప్రాజెక్టు సాకారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

రైల్వే ప్రాజెక్టు సాకారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

PLD: శావల్యాపురం-బాపట్ల నూతన రైల్వే మార్గంతో చిలకలూరిపేట అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. ఆదివారం రైల్వే సాధన సమితి సభ్యులు ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ లైన్‌తో అమరావతి అనుసంధానం, కోటప్పకొండ భక్తులకు సౌకర్యం కలుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపీలతో మాట్లాడి ప్రాజెక్టు సాకారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.