వైరాలో నేటి నుంచి 'సీఎం కప్' క్రీడా సంబరాలు

వైరాలో నేటి నుంచి 'సీఎం కప్' క్రీడా సంబరాలు

KMM: వైరా నియోజకవర్గ స్థాయి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రతిష్టాత్మక 'సీఎం కప్ 2025-26' టోర్నమెంట్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రెబ్బవరంలోని పీఎం శ్రీ ZPHS వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. వైరా నియోజకవర్గ పరిధిలోని వైరా, కొణిజర్ల, ఏన్కూర్, సింగరేణి మండలాలకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటనున్నారు.