'ద్విత్వా తుఫాను.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
ప్రకాశం: ద్విత్వా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి అన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు తుఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం కోసం తుఫాను బాధితులు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సహాయం పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.