నకిలీ మద్యం ఇలా గుర్తించొచ్చు

నకిలీ మద్యం ఇలా గుర్తించొచ్చు

KDP: స్కాన్ చేసి నకిలీ మధ్యాన్ని గుర్తించొచ్చని ప్రొద్దుటూరు ఎక్సైజ్ CI సురేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. APTATS యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈయాప్ ద్వారా మద్యం బాటిళ్ల మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తయారీ వివరాలు వస్తాయన్నారు. ఆ మద్యం బాటిల్ ఒరిజినలా? నకిలీనా? అనే సమాచారం తెలుస్తుందన్నారు. ప్రొద్దుటూరు దుకాణాల్లో నకిలీ మద్యం లేదన్నారు.