వైద్య సిబ్బంది పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం

SDPT: మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాఫ్ నర్సు సవిత, అటెండర్ మాత్రమే విధుల్లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.