నేడు పీజీఆర్ఎస్‌కు హాజరుకానున్న కలెక్టర్

CTR: పులిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతున్నట్లు తహసీల్దార్ జయసింహ తెలిపారు. పులిచెర్ల, రొంపిచెర్ల మండల ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమంలో తెలియజేయవచ్చన్నారు.