కుందూ వరదలో మునిగినపంటలు

కుందూ వరదలో మునిగినపంటలు

KDP: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో పెద్దముడియం, పాలూరు, నాగరాజుపల్లె పరిసరాల్లోని పంట పొలాలు వరద నీట ముంపుకు గురయ్యాయి. రైతులు సాగు చేసిన మినుము, జొన్న పంటలు నీట మునిగిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు చెబుతున్నారు. మునక ప్రాంతాలను స్థానిక MAO, AAOలు పరిశీలించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.