రామంతపూర్‌లో వరదనీటి కాలువతో సమస్యకు చెక్..!
MDCL: రామంతపూర్ డివిజన్ పరిధిలో రూ.3 కోట్ల వ్యయంతో భారీ వరద నీటి కాలువ పనులు విజయవంతంగా పూర్తిచేశారు. పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి, డ్రైనేజీ సమస్యలను సైతం పూర్తిగా పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్య తగ్గి, ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.