పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అందజేత

పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అందజేత

MHBD: నర్సింహులపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొమ్ములవంచకు చెందిన విజయేందర్ శనివారం మధ్యాహ్నం సంతలో ఫోన్ పోగొట్టుకున్నారు. వెంటనే బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్ తిరుమలేష్ CEIR పోర్టల్ ద్వారా మొబైల్ లొకేషన్‌ను గుర్తించారు. ఇవాళ పోలీస్ స్టేషన్‌లో బాధితుడికి మొబైల్ ఫోన్ అందజేశారు. బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.