అందెశ్రీ మృతి పట్ల BJP నేతల సంతాపం
TG: అందెశ్రీ మృతి పట్ల BJP నేతలు సంతాపం ప్రకటించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, BJP చీఫ్ రామచందర్ రావు.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పాటలతో అన్ని వర్గాల ప్రజలను కదిలించారని కిషన్ రెడ్డి కొనియాడారు. 'నిరంతరం పేదల అభ్యున్నతికై ఆలోచించే వ్యక్తి. చదువు లేకపోయినా జీవిత అనుభవాలనే పాటలుగా రచించారు. అందెశ్రీ ఆత్మకు శాంతి కలగాలి' అని బండి అన్నారు.