VIDEO: బావిలో దూకి మహిళ ఆత్మహత్య
సత్యసాయి: సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన ఈడిగ ఆనందమ్మ (52) సోమవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమందేపల్లి ఎస్సై సుధాకర్ యాదవ్ వివరాల మేరకు.. ఆనందమ్మ మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్లి పాపిరెడ్డిపల్లి సమీపంలోని బావిలో దూకి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.