గోవులను తరలిస్తున్న లారీ పట్టివేత
ELR: జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమ గోవుల రవాణా వెలుగుచూసింది. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి హైదరాబాద్‌కు 70 గోవులను అనధికారికంగా తరలిస్తున్న లారీని ఎస్సై వాసం క్రాంతికుమార్ పట్టుకున్నారు. పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించి, రవాణా నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.