ఆలయానికి వంట పాత్రలు అందజేత
NRPT: నారాయణపేట పట్టణంలోని అశోక్‌నగర్ అభయాంజనేయ స్వామి ఆలయానికి బహార్‌పేట విధికి చెందిన పల్లెగిరి చిన్నమ్మ మాన్య గురువారం వంట పాత్రలు విరాళంగా అందించారు. సుమారు రూ.15 వేల విలువైన ఈ పాత్రలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.