కరాటే కళ్యాణిని అడ్డుకున్న పోలీసులు
ELR: కైకలూరులో నటి కరాటే కళ్యాణిని పోలీసులు అడ్డుకున్నారు. 'చలో ఆకివీడు' కార్యక్రమానికి వెళ్లకుండా ఆమెను ముందస్తు అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని విమర్శించారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.