గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం పంపిణీ
SDPT: అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు తండా గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు గుడ్లు, బాలామృతాన్ని గ్రామ సర్పంచ్ కృష్ణనాయక్ శనివారం పంపిణీ చేశారు. అనంతరం చిన్నారుల రికార్డులను పరిశీలించి, సేవలపై వివరాలు తెలుసుకున్నారు. పోషకాహారం సరైన విధంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.