కల్తీ కల్లు తాగొద్దని వాల్ పోస్టర్లు ఆవిష్కరణ

KMR: కల్తీ కల్లు తాగి అనారోగ్యానికి గురి కావద్దని దోమకొండ ఎక్సైజ్ సీఐ మధుసూదన్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాడ్వాయి మండలంతో పాటు ఆయా గ్రామాల్లో కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించొద్దంటూ వాల్ పోస్టర్లు, కర పత్రాలు అతికిస్తూ అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై దీపిక పాల్గొన్నారు.