ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నా పర్యవేక్షణ లేక ఇబ్బందులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణవాయువు సరఫరా వ్యవస్థపై ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఆక్సిజన్ అందించే వ్యవస్థ ఉన్నప్పటికీ దానిని పర్యవేక్షించాల్సిన ఆక్సిజన్ ఆపరేటర్ లేకపోవడం గమనార్హం. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారనే విషయంపై స్పష్టత లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.