జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ నియామకం
విశాఖ జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీగా 50వ వార్డు మాజీ కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన జగన్‌కు, జిల్లా అధ్యక్షుడు కె.కె రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.