హోంగార్డ్ వ్యవస్థ పోలీస్ శాఖలో అంతర్భాగం: ఎస్పీ
VKB: హోంగార్డ్ వ్యవస్థ పోలీస్ శాఖలో ఒక ముఖ్యమైన అంతర్భాగమని ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా ఆమె మాట్లాడారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సమయాల్లో అదనపు శక్తిగా పనిచేస్తుందని తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్రేషియాను మంజూరు చేశారు.