యువతి హత్య కేసులో నిందితులకు రిమాండ్
W.G: తణుకు మండలం ముద్దాపురంలో ముళ్లపూడి నాగ హారిక హత్య కేసుకు సంబంధించి తండ్రి శ్రీనివాస్, సవతి తల్లి రూపలను అరెస్టు చేసి కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేవలం ఆస్తి కోసమే కుమార్తెను తండ్రి, సవతి తల్లి కలిసి హత్య చేసినట్లు చెప్పారు. ఆయనతో పాటు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ పాల్గొన్నారు.