కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి అరెస్ట్
ASF: డబ్బుల కోసం కొడుకుపై దాడి చేసిన తండ్రిని అరెస్ట్ చేసినట్లు రెబ్బెన పోలీసులు తెలిపారు. కిషన్ జీతం డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న తండ్రి శంకర్ నాయక్ కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కిషన్ తీవ్రంగా గాయపడటంతో కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శనివారం శంకర్ నాయక్‌ను అరెస్ట్ చేశారు.