రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

కృష్ణా: మోపిదేవి మండలంలో ఇవాళ కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా పర్యటించారు. పెద్దప్రోలు గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించి, సచివాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను, సేవల నాణ్యతను కలెక్టర్ సమీక్షించారు.