నాయనపల్లి మైసమ్మ ఆలయానికి తగ్గిన భక్తుల రద్దీ

NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని నాయనపల్లి మైసమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయానికి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భక్తుల రద్దీ తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. ఆలయ పరిసర దుకాణదారులు గిరాకి లేక నిరాశ వ్యక్తం చేస్తున్నారు.