VIDEO: భూ వివాదం.. వ్యక్తిపై దాడి
అన్నమయ్య: సంబేపల్లి మండలం గున్నికుంట్ల హరిజనవాడలో భూ వివాదం కారణంగా సోమవారం ఉద్రిక్తత నెలకొంది. భూమి సరిహద్దుల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో వేణుగోపాల్‌పై బండపల్లి అశోక్, చంద్రయ్య, పాలకుంట కృష్ణయ్య, నాగయ్య, రెడ్డయ్య తదితరులు దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. గాయపడిన వేణుగోపాల్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.