విద్యుత్ సామగ్రి చోరీ.. స్థానికుల ఆవేదన
NLR: వలేటివారిపాలెం అయ్యవారిపల్లె లేఅవుట్లో విద్యుత్ పరివర్తకం చోరీకి గురైనట్లు శనివారం స్థానికులు తెలిపారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించకపోవడం, 2 లేఅవుట్ గ్రామానికి దూరంగా ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అధికారులు విచారణ చేసి, లేఅవుట్లో మౌలిక వసతులు పునరుద్ధరించాలని పట్టాదారులు కోరుతున్నారు.