రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

SRPT: ఆత్మకూరు (ఎస్) మండలం ఎనుబముల ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి, విషమ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.