మంత్రి కలిసిన పెద్ద కొప్పెర్ల గ్రామ ప్రజలు

NDL: బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని పెద్ద కొప్పెర్ల గ్రామ ప్రజలు బుధవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద కొప్పెర్ల ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్‌గా గడ్డం వెంకటేశ్వర్ రెడ్డిని గ్రామ ప్రజలు రైతులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రైతులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.