VIDEO: ఇంటిపై జెండా ఎగురవేసిన రామచంద్రారెడ్డి

GDWL: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ ఎస్. రామచంద్రారెడ్డి తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సైనికులు, మాజీ సైనికులను సత్కరించారు.