కొనుగోలు కేంద్రంలో ప్రమాదం
JGL: ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రమాదం జరిగింది. డ్రైవర్ గమనించక లారీని ముందుకు కదిలించడంతో, విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ అసిస్టెంట్ ఏలేటి నిషాంత్ ఎడమ కాలిపై నుంచి లారీ టైర్ వెళ్లింది. దీంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు తక్షణమే హైదరాబాదులోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.