తుఫాను ప్రభావంతో మదనపల్లిలో మొదలైన వర్షం

KDP: తుఫాను ప్రభావం కారణంగా మదనపల్లె పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వర్షం మొదలైంది. చిరు జల్లులు కురుస్తుండటంతో వాహనదారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడం తెలిసిందే. ఈ వర్షాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు.