80 మెట్రిక్ టన్నుల భవానీ దుస్తుల తొలగింపు
NTR: భవానీ దీక్షల విరమణ సందర్భంగా VMC ఆధ్వర్యంలో సమగ్రమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 80 మెట్రిక్ టన్నుల భవానీ దుస్తులు సహా మొత్తం 380 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సిబ్బంది తొలగించారు. 68 వాటర్ పాయింట్లు ఏర్పాటు చేసి, 1,690 మంది పారిశుద్ధ్య కార్మికులు 3 షిఫ్ట్లలో విధులు నిర్వహించారు. మెరుగైన నిర్వహణతో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించిన సిబ్బందిని కమిషనర్ ధ్యాన్‌చంద్ర అభినందించారు.