ప్రొద్దుటూరులో MEO కార్యాలయాన్ని ప్రారంభించిన MLA
KDP: ప్రొద్దుటూరు మండల విద్యాశాఖ కార్యాలయం నూతన భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ మేరకు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం కొత్త భవనంలో అధికారులు, ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించామని అన్నారు.