'సమ్మె విచ్ఛిన్నకర చర్యలు ఆపాలి.. సంఘాలతో చర్చించాలి'
RR: సమ్మె విచ్ఛిన్నకర చర్యలు ఆపాలని, కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు రాజు అన్నారు. సమ్మె సందర్భంగా షాద్ నగర్ RTC ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి కార్మిక సంఘాలపై ఆంక్షలు కొనసాగించడం అన్యాయం అన్నారు. RTC కార్మికుల కుటుంబాల ప్రయోజనాల కోసం RTC సంఘాలతో చర్చలు జరపాలన్నారు.