VIDEO: సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు

CTR: పుంగనూరులో సింహ వాహనంపై మాడవీధుల్లో శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీవారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత అర్చకులు యోగ నారాయణస్వామి అలంకారంలో శ్రీవారిని సింహవాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు.