నెల్లూరు ఇంఛార్జ్ మేయర్గా రూప్ కుమార్
NLR: నగర మేయర్గా స్రవంతి చేసిన రాజీనామాను కలెక్టర్ ఆమోదం తెలిపారు. కొత్త మేయర్‌ను ఎన్నుకునే వరకు కార్పోరేషన్లో పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా డిప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్గా ప్రకటించాలని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో కొత్త మేయర్ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ ఇంఛార్జ్ మేయర్గా కొనసాగుతారని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది