వాసవీ మాత సన్నిధిలో అనంతపురం ఎంపీ

సత్యసాయి: హిందూపురంలో ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవీ మాత జయంతి ఉత్సవాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ముందుగా ఎంపీ దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ సిబ్బంది ఎంపీ దంపతులను సత్కరించి ప్రసాదాలు అందజేశారు.