దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య

దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య

AP: పత్రికల్లో, మీడియాలో ఏమైనా అసత్య ప్రసారాలు వస్తే వాటిపైన శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అలా కాకుండా భౌతిక దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదన్నారు. పత్రిక స్వేచ్ఛకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడటం ఏ రాజకీయ పార్టీలకైనా తగదని సూచించారు. దాడులకు పాల్పడితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ చర్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు.