కరీంనగర్ ప్రధాన బస్టాండ్‌లో అగ్ని ప్రమాదం

కరీంనగర్ ప్రధాన బస్టాండ్‌లో అగ్ని ప్రమాదం

KNR: కరీంనగర్ ప్రధాన బస్టాండ్‌లోని ఒక ప్లాట్ ఫారం వద్ద శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, ఎలాంటి పెద్ద ప్రమాదం జరగకుండా నివారించారు.  మంటలు తగ్గడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.