గుంటూరులో మట్టి గణపతి నిమజ్జనం

గుంటూరులో మట్టి గణపతి నిమజ్జనం

GNTR: గుంటూరులోని రాజీవ్ గాంధీ నగర్‌లో జై భారతీ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. మట్టి గణపతిని ప్రతిష్ఠించి విశేష పూజలు చేశారు. ఆదివారం రాత్రి పంచామృతాలతో అభిషేకాలు చేసి, ఉత్సాహంగా లడ్డూ వేలం వేశారు. అనంతరం ప్రాంగణంలోనే మట్టి గణపతి నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.