'ఇంటి నెంబర్ కావాలంటే.. లంచం ఇవ్వాల్సిందే'
మహబూబాబాద్ జిల్లా బాబా గుట్ట కాలనీకి చెందిన బొలెద్దుల వాణికి గత ప్రభుత్వంలో అసైన్డ్ భూమి పట్టా మంజూరైంది. అయితే ఆన్‌లైన్ రికార్డులో కనిపించని తన ఇంటి నెంబర్‌ను పునరుద్ధరించాలని గత నాలుగేళ్లుగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఉద్యోగులు రూ. 25వేలు లంచం ఇస్తేనే ఇంటి నెంబర్ ఆన్ లైన్ చేస్తామని చెబుతున్నట్టు బాధితురాలు వాపోయారు.