కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి
NRPT: మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయానికి సంబంధించిన కోనేరు అభివృద్ధి పనులను ఇవాళ పరిశీలించారు. మరో 20 రోజుల్లో జాతర రానున్న నేపథ్యంలో, పనులు వేగవంతం చేయాలని ఆలయ ఈవోకు ఆయన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.