అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం

RR: జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాజేంద్రనగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బుద్వేలులో నూతన హైకోర్టు భవనం పనులు కొనసాగుతున్నాయి. రెండోదశలో భాగంగా న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణానికి ఉదయం 10.30గంటలకు సీజేఐ సూర్యకాంత్‌తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు.