దివాన్ చెరువు ఆర్‌ఎఫ్‌లో చిరుత పాదముద్రలు గుర్తింపు

దివాన్ చెరువు ఆర్‌ఎఫ్‌లో చిరుత పాదముద్రలు గుర్తింపు

తూ.గో: దివాన్ చెరువు దగ్గర ప్రాంతంలో సోమవారం చిరుత పులి పాదముద్రలను గుర్తించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. చిరుత పులి అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు ట్రాప్ కెమెరాలు గుర్తించామన్నారు. చిరుత వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశామని, చిరుత సంచారాన్ని బట్టి ట్రాప్ కెమెరాలు మార్పులు చేస్తునన్నామన్నారు.