గిల్‌పై అప్పుడే వేటు వద్దు: అశ్విన్

గిల్‌పై అప్పుడే వేటు వద్దు: అశ్విన్

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ శుభ్‌మన్ గిల్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. దీంతో గిల్‌ను జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ స్పందిస్తూ.. గిల్‌ను సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడించాలని చెప్పాడు. 'అప్పుడు విఫలమైతే గిల్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలి. అంతేకానీ, సిరీస్ మధ్యలో నిర్ణయం తీసుకోవద్దు' అని తెలిపాడు.