భూనీడులో ఇఫ్తార్ విందు..!
NRPT: పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, మతసామరస్యానికి ప్రతీక అని భూనీడు మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు లాలు బాయ్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ అన్ని మతాలను సమానంగా గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.