టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌లకు శిక్షణ తరగతులు
AKP: ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లకు శిక్షణ తరగతులు ఇవాళ నుంచి మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలనే అంశంపై శిక్షణ ఇస్తున్నట్లు ఎలమంచిలి మండలం పార్టీ క్లస్టర్ ఇంఛార్జ్ కరణం రవికుమార్ తెలిపారు.